Thursday, February 16, 2017

ఊదలు ( Barnyard Millet )

తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం . ( 11 )

ఊదలు ( Barnyard Millet ) .
       ఊదలు ఆసియా ఖండంలోనే ఎక్కువగా పండుతాయి. భారత దేశం , పాకిస్థాన్ , నేపాల్ , జపాన్ , చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా , మన రాష్ట్రంలో మరియు తమిళనాడులో కొన్ని చోట్ల ఊదలు పండిస్తున్నారు.
    ఈ ఊదలు తియ్యగా ఉంటాయి . ఇందులో అధిక మోతాదులో పీచు పదార్థం , ఫాస్పరస్ మరియు కాల్షియం వున్నవి . చాలా తక్కువగా కార్బోహైడ్రేట్లు వున్నవి .
       ఊదలు సులభంగా జీర్ణం అవుతాయి మరియు బలవర్ధకమైన ఆహారం .
       గర్భవతులకు , పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం.
      ఊదలు శరీర ఉష్ణోగ్రతలను సమస్ధితిలో వుంచుతాయి .
      ఎక్కువ శారీరక శ్రమలేని వారికి సులువుగా జీర్ణమయ్యే ఆహారం .
      పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్దకానికి , మధుమేహానికి చాలా మంచిది .
      చిన్న ప్రేగులలో వచ్చే పుండ్లు , పెద్ద ప్రేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు కాపడతాయి.
' చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం '
సేకరణ.

కె. వి. రాజేష్ ,
సుజాత
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894  91922 .

No comments:

Post a Comment