Thursday, February 16, 2017

జొన్నలు ( Jowar / Sorghum )

తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ( 12).
జొన్నలు  ( Jowar / Sorghum ) .
      సింధు నాగరికతకు సమాంతరముగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాలలో జొన్నల్ని బాగానే పండించారు . 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రధాన ఆహార ధాన్యంగా తీసుకొని జీవిస్తున్నారు . ఆఫ్రికా , ఆసియా , ఆస్ట్రేలియా లో జొన్నలు ఎక్కువగా పండిస్తారు. భారత దేశంలో గోధుమ తర్వాత ఎక్కువగా పండించే ఆహార పంట జొన్నలు . ఆంధ్ర , కర్ణాటక , తమిళనాడు , రాజస్తాన్ , ఉత్తర ప్రదేశ్ , మధ్యప్రదేశ్ , హర్యానాలలో ఎక్కువగా పండిస్తారు.
    జొన్నలు తెలంగాణ , రాయలసీమల్లో ముఖ్యమైన పంట మరియు ముఖ్యమైన  ఆహారం .
      చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి . అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న . జొన్న అన్నం తిని ఎంత పని చేసినా ఆకలి ఉండదు . అనారోగ్యం దరి చేరదు . జొన్నలతో మన అభిరుచికి తగ్గట్టు ఆధునిక వంటకాలు తయారు చేసుకోవచ్చు . మనం రోజు తీసుకునే ఆహారంలో జొన్నును చేరుస్తే పోషక విలువలతో పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది .
పోషకాలు : --

       జొన్నల్లో ప్రోటీన్లు , ఇనుము , కాల్షియం , బి. విటమిన్లు , ఫోలిక్ ఆమ్లం , పీచు పదార్థం , ధయామిన్ ,.మాంసకృతులు , రైబోఫ్లేవిన్ , నియాసిన్ , ఫాస్పరస్ మొదలగునవి కలవు .
ఆరోగ్య ప్రయోజనాలు ..
1 . శరీర పెరుగుదలకు , శక్తికి ఉపయోగపడుతుంది .
2. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం .
3 . కొవ్వుని తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది .
4 . తేలిగ్గా జీర్ణమవుతాయి .
5 . జబ్బు పడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్ధాలను పెట్టడం ఎంతో మంచిది .
6 . అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్ధకమైన ఆహారంగా పని చేస్తాయి .
7 . తగినంత పీచు ఉండటం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి .
      జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ అనే మృదువైన ప్రోటీన్ చాలా మందికి సరిపడటం లేదు . అందు వలన ఈ ప్రత్యామ్నాయ ధాన్యం మీదకు ప్రపంచం తన దృష్టి సారించింది .
      రంగు రుచి వాసన లేకుండా తటస్ధంగా ఉంటుంది . కాబట్టి జొన్నపిండి ఏ ఇతర వంటకంలోనయిని కలుపు కోవటానికి వీలుపడుతుంది .
   జొన్నలు అన్ని రకాల ధాన్యాలకంటే బలవర్ధకమైనవి .
"చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం"

సేకరణ .
  కె. వి. రాజేష్ ,
  సుజాత
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ .
కర్నూలు .
Cell .  99894  91922 .

No comments:

Post a Comment