Tuesday, October 3, 2017

ఉబ్బసం

ఊపిరి తిత్తులలో గాలి మార్గం కుంచించుక పోయినపుడు , శ్వాస పీల్చుకొనుటలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనినే *ఆస్తమా* అంటారు . దుమ్ము , ధూళి , పొగ వున్న ఇంటిలో నివసించడము వలన ఆస్తమా వస్తుంది . కొందరిలో వంశ పారంపరముగా వుంటుంది . ఎక్కువగా ధూమ పానం చేసే వారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుంటుంది . ఆపుడప్పుడు ఆస్తమా ఎక్కువగా వుండును . తగ్గుతూ , పెరుగుతూ వుంటుంది . ఈ శ్లేష్మం బయటకు వచ్చినప్పుడు రోగికి ఇబ్బందిగా వుండదు . అపుడప్పుడు కఫం వస్తూ వుంటుంది . శ్లేష్మం బయటకు రాని యెడల శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా వుండును .

పిల్లల (జలుబు )

# మనిషి పుట్టినది మొదలు 13 సంవత్సరాల వయసు వరకు కఫం యొక్క ప్రభావానికి లోనై వుంటాడు .
# బాల్యంలో శరీరం మీద కఫ ప్రభావం ఎక్కువగా ఉంటుంది .
# పిల్లలు కఫ ప్రభావానికి లోనై వుంటారు . కనుక వారికి వచ్చే రోగాలు *ముక్కులో కారడం , దగ్గు , జలుబు* ఇలా వుంటాయి .
# శరీరం కఫం తోటి తయారయ్యింది , ధాతువులు ఉన్నాయి .

ముక్కు దిబ్బడ , జలుబు

చల్లని గాలుల వలన , చల్లని నీళ్ళలో తడిసిన , వర్షంలో తిరిగిన ముక్కు దిబ్బడ మరియు జలుబు వస్తుంది . జలుబు వలన తుమ్ములు  ఎక్కువగా వస్తాయి . ముక్కు నుండి నీరు కారడం , చీమిడి ( Mucus ) వస్తుంది .

*గృహ చికిత్సలు*

1. ఒకటి లేక రెండు ఎల్లిపాయ రెబ్బలను ( Garlic ) నమిలి , నమిలి తినండి . తర్వాత నీళ్ళు త్రాగండి .

2 . 10 *పుదీన ఆకులు* + 6 *మిరియాల గింజలు* + *చిటికెడు సైంధవ లవణం* + 10 *తులసి ఆకులు*  + 1 *గ్లాసు నీళ్ళలో*కలిపి , 1/2 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరిగించి , చల్లార్చిన తర్వాత త్రాగండి .

3 *ఉసరి కాయ రసం*  + *తేనె* ను కలిపి తీసుకొండి .

4 .నాలుగు *ఎర్ర యాలకులు*  + 8 *లవంగాలు* + *కొద్దిగా అల్లం రసం*  + 10 *తులసి ఆకులు* +  1 *గ్లాసు నీళ్ళల్లో* మరిగించండి .
( 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత త్రాగవలెను ).

5 . *వరి మొక్క*ను పేష్ట్ లాగా చేసి ముక్కు మీద పూయండి. జలుబు తగ్గుతుంది .

6 . 2 *చిటికెల ముల్లంగి గింజల పొడి*  + 1 *గ్లాసు నీళ్ళలో* కలిపి త్రాగండి .

7 . *దాల్చిన చెక్క పొడి*  + *జాజి కాయల పొడి* లను సమ పాళ్ళలో కలపండి . చూర్ణం తయారగును .
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం 1/2 tea spoon చూర్ణం తీసుకొన వలెను .

8 . 1/2 Spoon *సొంఠి పొడి*  + 1 గ్లాసు వేడి *ఆవు పాలల్లో* త్రాగండి .

9 *పసుపు పొడి* + *వాము పొడి* సమ పాళ్ళల్ల్ కలిపి ,+ 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించి , కషాయం లాగా చెయ్యండి + *బెల్లం* కలిపి త్రాగండి .

10 . 1 గ్లాసు *వేడి నీళ్ళలో* + *నిమ్మ రసం* కలిపి త్రాగండి . జలుబు తగ్గుతుంది .
( రాత్రి పడుకునే ముందు త్రాగండి . జలుబు తగ్గుతుంది )

11 . 100 గ్రాముల *ఖర్జురాల ముక్కలు*   + 1 *గ్లాసు మేక పాలల్లో* మరిగించి , ఖర్జురాలను తినండి .
( జలుబు తగ్గడానికి అత్యుత్తమమైన చికిత్స )

12 . *పచ్చి ఉల్లి పాయ ( onion )* ముక్కలు తినండి . ముక్కులో కారడం తగ్గుతుంది .

13 . *అల్లం రసం*  + *తేనె* ను సమ పాళ్ళలో కలిపి తీసుకొండి .

14 . *పెరుగు* + *మిరియాల పొడి*  + *చెక్కర* ( Chemical Free ) లను కలిపి తినండి .

15 . *జ్వరము* + *జలుబు*  + *తల నొప్పి* నివారణ .: ----

*మిరియాల పొడి* + *పసుపు*  + 1 *గ్లాసు ఆవు పాలల్లో* కలిపి త్రాగండి .
( మీకు చాలా Relief గా వుంటుంది ) .

   పై చికిత్స విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

Monday, September 11, 2017

దేశవాళి ఆవు నెయ్యి గురించి

ఆవు నెయ్యి అంటే పూర్తిగా పసుపు పచ్చగా ఉంటుంది అనుకొంటూ వుంటారు కొందరు. కాని వాస్తవంగా ఆవు నెయ్యి యొక్క రంగు ఒక్కో రుతువులో ఒక్కోరకంగా ఉంటుంది. ఆవు ఆకు పచ్చని మేతను ఎక్కువగా తిన్నప్పుడు అది ఇచ్చిన పాలను తీసిన నెయ్యి ఎక్కువ పసుపు పచ్చిగా ఉంటుంది. వేసవిలో ఆవు ఎక్కువగా ఎండిన మేతను తినడం వలన అది ఇచ్చే పాలనుండి తీయబడిన నెయ్యి అంత పసుపు పచ్చగా ఉండదు. మరొక విషయం ఆవు నెయ్యిలో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం ఎండాకాలంలో కూడా ఘన పదార్ధంలా గట్టిగానే ఉంటుంది. ఇక తక్కిన భాగం పలుచగా , ద్రవంలాగా ఉంటుంది.

      ఒకే చోట నిలబడి ఉంటే ఆవు ఇచ్చే పాలలో పోషక విలువలు అంత ఎక్కువగా ఉండవు. ఆవు స్వేచ్ఛగా సంచరిస్తూ మేత మేస్తూంటే ఆరోగ్యంగా ఉంటుంది. కనుక తిరుగుతూ మేతమేసే ఆవుల పాలు , నెయ్యి ఎంతో నాణ్యమైనవి.

      శుద్ధమైన ఆవు నెయ్యి మాత్రమే శరీరం యొక్క బరువును సమతూకంలో ఉంచుతుంది. అంటే ఎవరైన తక్కువ బరువు కలిగి ఉంటే వారి బరువు పెరుగుతుంది. అలాగే అధిక బరువు వారికి బరువు తగ్గుతుంది. ఆవు నెయ్యి తో శరీరంలోని కొలెస్ట్రాల్ పూర్తి సాధారణ స్ధాయికి చేరుతుంది.

      " నెయ్యి ఎప్పుడూ అరిగిస్తుంది. " . అజీర్తి రోగమున్నవారు , జీర్ణ శక్తి తక్కువగా ఉన్నవారు తప్పకుండా ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఆవు నెయ్యి మనకు అద్భుతమైన ప్రాణ శక్తిని ఇస్తుంది. ఆవు నెయ్యి అరగటం అనేది అసలు సమస్సనే కాదు. అద్భుతమైన , ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు ఉన్నది. ఆవు నెయ్యి లోనే  ఉన్నాయి. ఆవు నెయ్యి జీర్ణ శక్తికి ఎంతో మంచిది. ఆవు నెయ్యి   తేలికగా జీర్ణమవుతుంది.

      శుద్ధమైన దేశవాళి ఆవు నెయ్యి ని స్వీకరించి , సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

కౌ ధెరపీలో దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు

దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు రెండు ముక్కలలో రెండు రెండు చుక్కలు చొప్పున వేసుకొనవలెను.  తలక్రింద దిండు తీసివేయాలి. ఆ తర్వాత నేతి చుక్కలు వేసుకోవాలి. వెంటనే నీళ్ళు త్రాగకుడదు. ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా , మౌనంగా ఉండి పోవాలి. ముక్కలో ఈ ఆవు నెయ్యి చుక్కలు వేసుకున్న తర్వాత లోపలికి పీల్చుకోకూడదు. పీల్చుకుంటే అది ముందుకు వెళ్ళి పోతుంది. దాని పాత్రను అది నిర్వర్తించలేదు. అలా ముక్కలోనే ఉండి నెమ్మది నెమ్మదిగా రాత్రంతా మీరు నిద్ర పోయినా రాత్రంతా మీ ప్రాణ శక్తి మీ ఆజ్ఞా చక్రానికే అందుతుంది.

      మీ భ్రుకుటిన నడుమ రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది. అది శరీరంలోని క్రియలన్నింటినీ ఆజ్ఞాపిస్తుంది. ఈ ఆజ్ఞా చక్రం జాగృత మౌతుంది. దానిలోకి ప్రాణం ప్రవేశిస్తుంది. ఈ ఆజ్ఞా చక్రంలో ప్రాణం తగ్గటం వల్లనే శరీరంలోని వివిధ క్రియలను అది సక్రమంగా నియంత్రించలేక పోతుంది. అందులోకి ప్రాణ శక్తి చేరడం వలన అది మరలా శరీరక్రియలను సక్రమంగా నియంత్రించ గలుగుతుంది. ఈ విధంగా ఈ ఆజ్ఞాచక్రం జాగృతమవుతుంది.

      ఒక మాటలో చెప్పాలంటే కాలర్ బోన్ కు పై భాగంలో ఏ సమస్యవున్నా ముక్కులో  దేశవాళి ఆవునెయ్యి చుక్కలు వేయుట వలన ఎంతో అద్భుతమైన పరిణాములు వుంటాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొంద గలరు.

          

దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు

గోమాత మహిమ ఏమిటి ? మనిషికి ఎవరి మహిమ అయినా ఎప్పుడు అవగతమవుతుంది , అది తనస్వార్ధాన్ని  నెరవేర్చినపుడి అందులోని మహత్యం మనకి అర్ధమవుతుంది. ఈ రోజు అనారోగ్యం ఒక పెద్ధ సమస్య లక్షల రూపాయలు వెచ్చిస్తూ వున్నా ఆరోగ్యం మాత్రం అందడం లేదు. మనకు గోమాత కృపవల్ల ఎంతో తేలికగా , సులభంగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

         దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ప్రతి రోజు పడుకునేటప్పుడు రెండు ముక్కులలో రెండు రెండు చుక్కలు వేయుటవలన , కాలర్ బోన్కు పై భాగంలో ఏ ఆరోగ్య సమస్య వున్నా తగ్గిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం ఖచ్చితంగా చేకూరును.

      స్త్రీలు , పురుషులు , పిల్లలు , వృద్ధులు ఎవరైనసరే ఈ క్రింది అనారోగ్య సమస్యలతో వున్న వారు ఆవు నెయ్యి చుక్కలు వేసుకొని కొద్ది రోజులలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

అనారోగ్య సమస్యలు : -

       పక్షవాతం , చెవి పొర చిధ్రమైన వారు , మెదడులో క్లాట్స్ , కణతలు , ముక్కు వాసనలు గుర్తించక పోవడం , కోమాలో ఉన్నా , తలనొప్పి , పార్శ్వపు నొప్పి ( మైగ్రేయిన్ ), చికాకుపడడం , రాత్రి పూట నిద్ర రానివారు ,  సైనసైటిస్ , ఆగకుండా తుమ్మలు రావడం , స్మరణ శక్తి బలహీనంగా వున్నవారు , అలర్జిక్ ఆస్తమా , మతి మరపు ఎక్కువగా ఉన్నవారు , ఎవ్వరినీ  గుర్తు పట్టలేనంత మానసిక స్ధితిలో వున్నవారు , మెమరీలాస్ , జుట్టు రాలడం , బట్టతల , ఫ్రోజన్ షోల్డర్ , కంటిలో మంట వున్నవారు , చెవిలో చీము కారుతున్న , టెన్షన్ , పిల్లలు హైపర్ యాక్టివ్ గా వున్న వారు.

     పై అనారోగ్య సమస్యలు వున్న వారు నెయ్యి చుక్కలు వేసుకొండి.

      దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ప్రతి రోజూ రాత్రి పడుకునేటప్పుడు రెండు ముక్కులలో రెండు రెండు చుక్కలు చొప్పున వేసుకొనవలెను. తలక్రింద దిండు తీసి వేయాలి. ఆ తర్వాత నెయ్యి చుక్కలు వేసుకోవాలి. వెంటనే నీళ్ళు త్రాగరాదు. ఐదు లేక పది నిమిషాలు ప్రశాంతంగా , మౌనంగా ఉండి పోవాలి. ముక్కులో ఈ ఆవు నెయ్యి చుక్కలు వేసుకున్న తర్వాత పీల్చు కొనకూడదు. పీల్చుకొనిన యెడల అది ముందుకు వెళ్ళి పోతుంది. దాని పాత్రను అది నిర్వర్తించలేదు. అలా ముక్కులోనే ఉండి నెమ్మది నెమ్మదిగా రాత్రంతా మీరు నిద్ర పోయినా , ఆవు నెయ్యిలో వున్న ప్రాణశక్తి మీ ఆజ్ఞా చక్రం జాగృత మౌతుంది. జాగృతమైన ఆజ్ఞా చక్రం మరలా శరీర క్రియలను సక్రమంగా నియంత్రించ గలుగుతుంది. అపుడు మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరు.

      దేశవాళీ ఆవు నెయ్యికి మాత్రమే ఈ అద్భుతమైన శక్తి కలదు.

         

స్వచ్ఛమైన నెయ్యి గురించి

ప్రస్తుతం బజారులో నెయ్యి పేరుతో అమ్మడు పోతున్నది అసలు నెయ్యి కానే కాదు. పాల నుంచి క్రీమ్ను తీస్తారు. ఆ క్రీమ్ను బట్టర్ అంటాం. ఈ బట్టర్ నుంచి నెయ్యిని తీస్తారు. అది నెయ్యి కాదు , అది బట్టర్ ఆయిల్ మాత్రమే.

      మన యశోదమాత పెరుగు చిలికి తీసిన దానిని వెన్న అంటాం. పెరుగును చిలికితే అమృతం వంటి వెన్న. ఆ వెన్న నుండి వచ్చేది అసలు సిసలైన నెయ్యి. వెన్నలో వుండే గుణాలు బటర్లో లేవు. వెన్న తినవలసిన పదార్థం. మన పిల్లలకు వెన్న తినిపించినట్లయితే ప్రపంచంలో నేటి వరకు వెన్నను మించిన టానిక్ మరొకటి తయారు కాలేదు. వెన్నను తినడం వల్ల శరీరాలు ఆరోగ్యవంతముగా వుంటాయి. మస్తిష్కాలు కూడా సూక్ష్మంగా పనిచేయ గలుగుతాయి. బుద్ధి తీక్షణత , తేజస్సు పెరుగుతుంది. అవకాశం వుంటే పిల్లలకు వెన్న తినిపించండి. పిల్లలకు నెయ్యి కంటే కూడా వెన్న ఎక్కువ మేలు చేస్తుంది. పెద్దలకు నెయ్యి మంచిది.

      ప్రస్తుతం మన వాళ్ళు పాలనుంచి మీగడను వేరు చేసి ఫ్రిజ్ లో భద్రపరుస్తూ వుంటారు. అది ఎక్కువగా కూడ బెట్టిన తర్వాత ఒక రోజు దానిని తీసి పొయ్యిపై పెట్టి వేడిచేసి నెయ్యి తయారయ్యింది అంటాము. ఇది పొరపాటు మీరు పాలనుంచి క్రీమ్ ని తియ్యకండి. వెన్నతో పాటే పాలను తోడు పెట్టండి. పెరుగు నుండి తీసిన వెన్నను ఒక చోట పెట్టండి.

      వెన్నతో పాటే పాలను తోడు పెట్టండి. ఆ పెరుగును చిలకటం కూడా మిక్సీలో కాకుండా మీరు స్వయంగా చిలకండి. యశోద మాతను స్మృతిలో వుంచుకుంటే మీ చేత తయారు చేయబడిన ఆ వెన్న ప్రసాదమవుతుంది. అమృతము అవుతుంది.

      మనం తోడు పెట్టిన పెరుగును మిక్సీలో చేసినట్లయితే అక్కడ జరిగేది ఘర్షణ. అపుడు ఆ పదార్ధంలో వున్న శక్తి , అందులోని ప్రాణ శక్తి కూడా తొలగి పోతుంది. అందుకే మీరు పెరుగును చేతితో చిలికి వెన్నను తీసి కూడ బెట్టండి. తరువాత దానితో నెయ్యి తయారు చెయ్యండి. అప్పుడు ఆ వెన్న ప్రపంచంలోనే అత్యుత్తమైన టానిక్.

      పాల నుంచి తీసిన క్రీముతోను , మీగడతోనూ తయారు చెయ్యబడిన వెన్న + నెయ్యి హానికరం.

      దేశవాళీ ఆవు పాలు , పెరుగు , వెన్న , నెయ్యి మాత్రమే శ్రేష్టం. పైలక్షణాలన్ని దేశవాలి ఆవు పాలు , వెన్న , నెయ్యిలకు కలవు.

           " హరే కృష్ణ "

                   శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.