Tuesday, October 3, 2017

పిల్లల (జలుబు )

# మనిషి పుట్టినది మొదలు 13 సంవత్సరాల వయసు వరకు కఫం యొక్క ప్రభావానికి లోనై వుంటాడు .
# బాల్యంలో శరీరం మీద కఫ ప్రభావం ఎక్కువగా ఉంటుంది .
# పిల్లలు కఫ ప్రభావానికి లోనై వుంటారు . కనుక వారికి వచ్చే రోగాలు *ముక్కులో కారడం , దగ్గు , జలుబు* ఇలా వుంటాయి .
# శరీరం కఫం తోటి తయారయ్యింది , ధాతువులు ఉన్నాయి .

# శరీరంలో *వేడి* పెరిగి ధాతువు కరిగి ముక్కు ద్వారా బయటకు వస్తుంటే అతనికి పడిశం ( జలుబు ) పట్టింది అని అంటాం .
# తల్లి బాలింతరాలిగా ఉన్నప్పుడు కొన్ని వేడి చేసే పదార్ధాలు తినిపిస్తారు . ఆ వేడిని తగ్గించటానికి *ఆవు నెయ్యి* ని తినిపించాలి . వారు అలా నెయ్యిని తిని ఉండరు . కనుక ఆ వేడి పాల రూపంలో తల్లి నుండి పిల్లకు చేరింది . ఆ వేడి వలన పాపకు జలుబు చేసింది .
# పాలిచ్చే తల్లి మైదాతో చేసిన ఏ పదార్ధాలు తినరాదు .
# మైదా కఫాన్ని దోష పూరితం చేస్తుంది .
# 0 - 4 సంవత్సరములలో వారు కనీసం 16 గంటలు నిద్ర పోవాలి .
*జలుబు నివారణ విధానము* :-
# పిల్లలో ఈ కఫం దోష పూరితం కాకుండా ఉండేలా చూసుకోవాలి .
# పిల్లలకు స్వచ్చమైన *కొబ్బెర నూనె* తో మాలీష్ చేయడం ద్వారా *కఫం*ను తగ్గించ వచ్చును .
# పిల్లలకు శరీరమంతా మాలీష్ చెయ్యండి . కఫం ఎక్కువగా ఉండే స్ధానాలు తల , చెవ్వులు బాగా మాలీష్ చెయ్యాలి .
# *కొబ్బెర నూనె*  చాలా శ్రేష్ఠమైనది మరియు ఉత్తమమైనది .
# మాలీష్ చేసిన తర్వాత  *శనగ పిండి లేదా సున్నిపిండి* తోనే స్నానము చేయించాలి . శనగ పిండి లేదా సున్ని పిండి కఫాన్ని అదుపులో వుంచుతుంది .
# ఏ *సబ్బు ( Soap )*లను వాడవద్దు . సబ్బులలో వున్న  *సోడియం హైడ్రాక్సైడ్ ( కాస్టిక్  సోడా)* కఫాని పెంచుతుంది .
*స్నానం చేయించే పద్ధతి* -----
# స్వచ్చమైన కొబ్బెర నూనెని శరీరానికి బాగా పట్టించి మర్ధన చెయ్యాలి .  10 - 15 నిమిషాల తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి . తర్వాత మరో 10 - 15 నిమిషాల తర్వాత పొడి పిండితో మొత్తం దేహానికి పెట్టిన నలుగును వదిలించాలి . తర్వాత శరీరమంతా శుభ్ర పడేలా నీళ్ళతో స్నానం చేయించాలి .

No comments:

Post a Comment