తృణధాన్యాలతో ... సంపూర్ణ ఆరోగ్యం. ( 9 )
అరికలు ( Kodo Millet ).
మనదేశంలో అరికలు ఎక్కువగా పండిస్తారు. సుమారుగా 3000 సం !! లనుండి అరికలను పండిస్తున్నారు . మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా , ఎత్తైన గిరిజన ప్రాంతాలలో స్వల్ప విస్తీర్ణంలో అరికలు పండిస్తారు . తమిళనాడు , గుజరాత్ , కర్ణాటక లలోనూ వీటిని పండిస్తారు. దక్కన్ పీఠభూములలో ఎక్కువగా ఆహారంగా తీసుకునే వారు.
ఈ అరికలలో ఎక్కువగా పీచు పదార్థం , లోఫ్యాట్ , ఫైటో కెమికల్స్ , ఫైటేట్స్ , సూక్ష్మపోషకాలు , యాంటీ ఆక్సిండెంట్స్ మొదలగునవి వున్నాయి .
మోకాళ్ళ నొప్పులకు , కీళ్ళనొప్పులకు , భుజం నొప్పులకు మొదలగు వాత రోగాలకు ఈ అరికెలు మంచి ఆహారం.
రుతుస్రావం సరిగా రాని స్త్రీలకు , కంటి నరాల బలానికి , మధుమేహానికి , బరువు తగ్గాలనే వారికి , వ్రణాలు ( పుండ్లు , గడ్డలు ) త్వరగా తగ్గటానికి , ఈ అరికలు చక్కటి ఔషధంగా పని చేసే ఆహారం.
వీటిలో వుండే సూక్ష్మ పోషకాల వలన క్యాన్సర్ ని నిరోధించ వచ్చును.
దీర్ఘకాలిక రోగాల వలన కలిగే బాధల ఉపశమనానికి , వాపులకు అరికలు తినడం ద్వారా మంచి గుణం కనబడుతోంది .
" చిరు ధాన్యాలు సంపూర్ణ ఆహారం "
సేకరణ.
రాజేష్ ,
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894 91922 .
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894 91922 .
No comments:
Post a Comment