Thursday, February 16, 2017

కొర్రలు ( Foxtail Millet ).

తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం. ( 6 )

కొర్రలు ( Foxtail Millet ).
      అతి ప్రాచీనమైనవి ఈ కొర్రలు . కొర్రలు ఆషియా , యూరప్ లలో పండిస్తారు . చైనీయులు వీటిని దైవసంభూత పంటగా ఆరాధిస్తారు. మన దేశంతో పాటు ప్రధానంగా చైనా , జపాన్ , రష్యా , ఆఫ్రికా , ఈజిప్ట్ దేశాల్లో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు . కొర్రలు మధుర , వగరు రుచులు కలిగి ఉంటాయి.
      శరీరానికి ఎంతో మేలు చేసే ' కొర్రల ' కు తృణధాన్యాల్లో ప్రత్యేక స్ధానం ఉంది.
      కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి. మీ వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. గింజలను దంచి పొట్టును సులువుగా వేరు చేయవచ్చును. గింజ ఎరుపు , పసుపు , తెలుపు , నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి.
      కొర్రలలో అధికంగా పీచు పదార్ధం , మాంసకృతులు , కాల్షియం , ఐరన్ , మాంగనీష్ , మెగ్నిషియం , ఫాస్ఫరస్తో పాటు విటమిన్లు అధిక పాళ్ళలో ఉంటాయి. చిన్న పిల్లలకు , గర్భిణీలకు కొర్ర  బలవర్ధకమైన ఆహారం.
ఆరోగ్యకర ప్రయోజనాలు : -
1. తృణ ధాన్యాలన్నింటిలోనూ సులభంగా జీర్ణమయ్యే ఆహారంలో కొర్రలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు అధికంగా ఉండటంతో జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది.
2 . పెద్ద పేగును ఎల్లపుడూ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు మలబద్ధకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి.
3 . గోధుమలు , వరి అన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపిని కొర్రలు కలిగి ఉంటాయి. దీంతో ఇవి మధుమేహగ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి వారి రక్తంలోని చక్కెర స్ధాయిలను నియంత్రిస్తాయి.
4 . కొర్రలను తీసుకొనడం వలన శరీరం యొక్క బరువు తగ్గుతుంది , మెటబాలిజం ప్రక్రియ మెరుగు పడుతుంది. కొవ్వు శరీరంలో చేరదు.
5 . మానసిక వ్యాధులు , టెన్షన్ , బత్తిడి తదితర సమస్యలతో బాధపడే వారికి సెరటోనిన్ అధికంగా అవసరమవుతుంది. అలాంటి సెరటోనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయేగపడతాయి.
6 . కొర్రలో ఉండే మెగ్నిషియం మైగ్రేన్ తల నొప్పులు , హార్ట్ ఎటాక్ లు , గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నియాసిన్  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . అద్భతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు ప్రోటీన్లు  కూడా కొర్రల్లో ఎక్కువగానే ఉన్నాయి.
7 . మహిళలకు కొర్రలో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగిస్తుంది.
      వరికి బదులుగా కొర్రలను తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి . అన్నం రూపంలోనే కాకుండా పిండి , రవ్వగా చేసుకుని వాటితో ఉప్మా , దోశ , ఇడ్లీ , సంకటి , కిచిడీ , పాయసం , రొట్టె ఇలా ఏది కావాలంటే అది చేసుకుని తినవచ్చు.
" చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
సేకరణ.
రాజేష్ ,
బాలాజీ స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు.
Cell. 9989491922.

No comments:

Post a Comment