తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం. ( 7 )
సజ్జలు / గంట్లు ( Pearl Millet ).
ఆసియా నుంచి అటు ఆఫ్రికా వరకూ సజ్జలు అనాదిగా పండుతున్నాయి. ఆఫ్రికాలోనే పుట్టి క్రీ : పూ : 2000 నాటికే భారత దేశానికి సజ్జలు వచ్చి ఉంటాయని చరిత్ర కారులు ఊహిస్తున్నారు. సజ్జలకు తెలుగులో గంట్లు / గంటెలని కూడా పిలుస్తారు. ఇవి వగరు , తీపి రుచులు కలిగి ఉంటాయి. సజ్జలు తెలుగు వారికి చాలా ఇష్టమైన , రుచికరమైన
ఆరోగ్యదాయకమైన , శక్తి నిచ్ఛే ఆహార ధాన్యం. సజ్జల్ని " బాడీ బిల్డింగ్ సీడ్స్ " అంటారు. ఆంద్రప్రదేశ్ లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.
ఆరోగ్యదాయకమైన , శక్తి నిచ్ఛే ఆహార ధాన్యం. సజ్జల్ని " బాడీ బిల్డింగ్ సీడ్స్ " అంటారు. ఆంద్రప్రదేశ్ లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.
సజ్జలు చక్కటి ప్రోటీన్ పుడ్ . వీటిలో కాల్షియం , ఐరన్ అధికంగా ఉంటాయి. ఫాస్పరస్ , కెరోటిన్ అనే పదార్ధములు పుష్కలంగా ఉన్నాయి.
ఆరోగ్యకర ప్రయేజనాలు : -
1. సజ్జలను మెత్తగా పిండి చేసి , వాటితో రొట్టెలను తయారు చేసి తేనెతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే మొలల బాధ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
2. మొలకెత్తిన ధాన్యాన్ని పిండి చేస్తే మాల్ట్ అంటారు. సజ్జల్ని తడిపి మూటగట్టి , మొలకలొచ్చిన తరువాత ఎండించి మరపట్టించుకుంటే ఆ మాల్ట్ లో ఎక్కువ జీవనీయ విలువలు ఉంటాయి. మొలకెత్తిన తరువాత సజ్జల్లో ప్రోటీన్లు అనేక రెట్లు వృద్ధి చెందుతాయి. విటమిన్లు , మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగానూ కెలరీలు తక్కువగానూ ఉండే సజ్జమాల్ట్ ఎక్కువ ప్రయోజనకారి.

3 . షుగర్ వ్యాధి , స్ధూలకాయమూ , పెద్ద బొజ్జ తగ్గడానికి మొలకెత్తిన సజ్జలు గొప్ప ఔషధంగా పని చేస్తాయి.
4 . సజ్జ జావ చేసుకొని త్రాగటం వల్ల శరీరానికి చలవ చేస్తుంది .
5 . డీహైడ్రేషన్ బారిన పడకుండా సజ్జలు కాపాడతాయి. దీంతో పాటు శరీరంపై గాయాలు కూడా వేగంగా తగ్గిపోతాయి.
6. సజ్జలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి.
7. సజ్జలతో చేసిన పదార్ధాలు తినటం వల్ల ఆరోగ్యకరమైన చర్మం , జుట్టు మీ సొంతమవుతుంది.
8 . సజ్జలు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి సజ్జలు చక్కటి ఆహారం.
9 . ఉత్తర భారతీయులు చలిని తట్టుకునేందు ఎక్కువగా సజ్జ రొట్టెలు తింటారు.
10 . గుండె బలానికి , ఎసిడిటీ సమస్యలకు సజ్జ మంచి ఆహారం.
11 . సజ్జలలో కెరోటిన్ ఉండటం వల్ల కంటి చూపుకు చాలా మంచిది.
12 . సజ్జలలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతో బాధ పడే వారికి సజ్జలు మంచి బలవర్ధకమైన ఆహారం. రక్తంలో కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది.
గమనిక : - మూత్రపిండాల వ్యాధితో బాధపడే వాళ్లు , కీళ్ళ వాతం ఉండే వాళ్లు సజ్జలను ఉపయోగించక పోవటం మంచిది.
" చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
" చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
సేకరణ.
రాజేష్ ,
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 9989491922.
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 9989491922.
No comments:
Post a Comment