తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం. ( 4 )
చిరుధాన్యాల ప్రయోజనాలు...
బియ్యం , జొన్నల్లో ఉండే పిండి పదార్థాలూ , గోధుమల్లోని ప్రోటీన్లూ వాటిల్లో లేని విధంగా కొద్ది పాళ్ళలో కొవ్వు లూ చిరుధాన్యాల్లో ఉంటాయి. అందుకే ఇవి సమతులాహారంగా ఉపయోగపడతాయి.
1. పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన:-
పీచు ఎక్కువగా ఉండటం వల్ల చిరుధాన్యాల్లోని పిండి పదిర్ధాలు నిదానంగా జీర్ణమవుతాయి. గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఉన్నందు వలన చెక్కర స్ధాయి అమాంతంగా పెరిగే అవకాశం లేదు. అందుకే మధుమేహరోగులకి ఇవి ఎంతో మంచివి. పీచు వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవు. చిరుధాన్యాలలో ఫైటేట్స్ , టానిన్స్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందు వలన కొలెస్ట్రాల్ నీ , మధుమేహాని , మలబద్ధకాన్ని , మొలల వ్యాధిని తగ్గిస్తాయి.
2. ఎముకల పుష్టికి :
కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చిరుధాన్యాలలో కాల్షియం , ఫాస్పరస్‌లు ఉన్నందు వలన ఎదిగే పిల్లలకు , వృద్ధులకు మరియు స్త్రీలకు ఎముకల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఎముకల క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి. చిరుధాన్యాలు కండ పుష్టిని , శరీర దృఢత్వాన్ని పెంచుతాయి.

3 . రక్తహీనతకి :-
రాగుల్లోని ఐరన్ స్త్రీలలో , గర్భిణీలు , పిల్లలలో తలెత్తే రక్తహీనతని నివారిస్తుంది.
రాగుల్లోని ఐరన్ స్త్రీలలో , గర్భిణీలు , పిల్లలలో తలెత్తే రక్తహీనతని నివారిస్తుంది.
4 . నరాల పటుత్వం : -
వీటిలో వుండే ఫాస్పరస్ శరీరానికి అవసరమైన శక్తినందించి , నాడీ వ్వవస్ధనూ ఆరోగ్యంగా మారుస్తుంది. లిసితిన్ వలన నరాలు పటుత్వంగా తయారవుతాయి.
5. క్యాన్సర్ బారిన పడకుండా : -
చిరుధాన్యాలలో ఉండే ఫోటో కెమికల్స్ , ఫైటేట్ , మరియు లిగ్నాన్లు రొమ్ము క్యాన్సర్ ప్రభావాన్ని చాలా మటుకూ తగ్గిస్తాయి.
ఎక్కువ మోతాదులో చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ల స్ధాయిలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వీటిలోని ఫైటేట్స్ మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ , క్యాన్సర్లూ , గుండె వ్యాధులు రాకండానూ కాపడతాయి.
ఎలాంటి ఆమ్లగుణం లేని చిరుధాన్యాలు ఎసిడిటితో బాధపడే వాళ్లకి ఎంతో మేలు.
వీటిలో అలర్జీ కలిగించే గుణం ఉండదు.
మెనోపాజ్ దాటిన మహిళలూ , అధిక రక్తపోటూ , కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్లూ మిల్లెట్స్ ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.

గర్భిణులూ , పాలిచ్చే తల్లలూ రాగుల్ని ఎక్కువగా తీసుకుంటే పాల ఉత్పత్తి బాగుంటుంది.
రాగులు మైగ్రెయిన్ తలనొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ , అసౌకర్యాన్ని దూరం చేస్తుంది.
చిరుధాన్యాల్ని బకేసారి కాకుండా నెమ్మదిగా జీవన విధానంలో చేర్చు కోవాలి. కొందరికి వాటి రుచి నచ్చదు. కొన్ని సార్లు అరగదు. అలాంటప్పుడు సాధారణ పద్ధతిలో నే వాటిని చేసుకోవాలి. అంటే జొన్న రొట్టె , రాగి సంకటి , సజ్జలు కిచిడీ రూపంలో తీసుకోవాలి. మెనోపాజ్ దాటి అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు లేదా గుండెజబ్బులొచ్చే ఆస్కారం ఉన్న మహిళలు వారంలో కనీసం ఆరు సార్లు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ అదుపులో ఉంటాయి.
"చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
సేకరణ.
రాజేష్.
బాలాజీ స్వస్తిక్ స్వదేశి స్టోర్స్.
కర్నూలు.
Cell. 9989491922.
"చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
సేకరణ.
రాజేష్.
బాలాజీ స్వస్తిక్ స్వదేశి స్టోర్స్.
కర్నూలు.
Cell. 9989491922.
No comments:
Post a Comment