తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం. ( 5 )
రాగులు. ( Finger Millet )
రాగులని ఫింగర్ మిల్లెట్స్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్స్ అని వ్వవహరిస్తారు. రాగులని ఆఫ్రికా , ఆసియా లోని మెట్ట ప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్ధలము ఇధియోపియాలోని ఎత్తుప్రదేశాలు. అయితే నాలుగు సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశ పెట్టబడినది. హిమాలయాల పర్వత సానువుల్లో 2300 మీటర్ల ఎత్తు వరకు రాగిని పండిస్తారు. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా అనేక గ్రామలలో ఒక ప్రధానమైన ఆహారం. ఈ రాగులు చేదు , కారం , తీపి , వగరు రుచులు కలిగి ఉంటాయి.
రాగులలో కాల్షియం , ఐరన్ ఫైబర్ , మినిరల్స్ , మరియు అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు :--
1. రాగుల్లో పుష్కలంగా లభించే పీచు కారణంగా రోజు రాగి జావను మజ్జిగ లేక పాలతో తీసుకునే వారికి జీర్ణ వ్వవస్ధ పని తీరు మెరగు పడి మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
2 . రోజు రాగి జావను తీసుకుంటే కడుపులో మంట తగ్గటంతో పాటు ఒంటికి చలువ చేస్తుంది . మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
3. వేసవిలో అయ్యే విపరీతమైన దాహార్తిని రాగి జావ తగ్గిస్తుంది.
4. సుగంధ పాలతో రాగి జావ తాగితే నాలుగు రోజుల్లో అదుపులోకి వస్తుంది.
2 . రోజు రాగి జావను తీసుకుంటే కడుపులో మంట తగ్గటంతో పాటు ఒంటికి చలువ చేస్తుంది . మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
3. వేసవిలో అయ్యే విపరీతమైన దాహార్తిని రాగి జావ తగ్గిస్తుంది.
4. సుగంధ పాలతో రాగి జావ తాగితే నాలుగు రోజుల్లో అదుపులోకి వస్తుంది.
5. ఖరీదైన డ్రైపూట్స్ లో లేని అరుదైన ఎమినో ఆమ్లాల వంటివి రాగుల్లో పుష్కలంగా లభిస్తాయి .
6 . రాగులతో చేసిన పదార్ధాలు తీసుకుంటే ఊబకాయస్తులకి ఆకలి అదుపులోకి వచ్చి బరువు తగ్గుతారు.
7 . రాగులను ఆహారంలో భాగంగా తినేవారికి హృదయ సంబంధిత వ్యాధులు , రక్తపోటు , మధుమేహం , ఆస్ధమా వంటి సమస్యలు రావు.
8. పాలుపడని బాలింతలు రాగి జావ తాగితే క్రమంగా పాల ఉత్పత్తి మెరుగు పడుతుంది.
9. రాగులకు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది.
10 . ఎదిగే పిల్లలకు అవసరమైన కాల్షియం , ఐరన్ రాగుల్లో పుష్కలంగా లభిస్తుంది.
11 . రాగుల్లోని అయోడిన్ ధైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది.
12 . నల్లని , ఒత్తెన కురులు కోరుకునేవారు రాగులను తప్పక ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
13 . కాయకష్టం చేసేవారు , ఆటగాళ్ళు రాగి పదార్ధాలు తీసుకుంటే తక్షణ శక్తి పొందుతారు.
14. రాగి వంటకాలు తీసుకునే వృద్ధులు , మహిళలు చిన్నారులకు రక్తహీనత , ఎముకలు పెలుసుబారటం వంటి బారిన పడటం వంటి సమస్యలు రావు.
ఎన్నో ప్రయోజనాలు ఉన్న రాగులను మన ఆహారంలో భాగం చేసి మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుదాం.
" చిరు ధాన్యాలు సంపూర్ణ ఆహారం "
సేకరణ.
రాజేష్.
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ .
కర్నూలు.
Cell. 9989491922.
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ .
కర్నూలు.
Cell. 9989491922.
No comments:
Post a Comment