Wednesday, February 15, 2017

బోదకాలు వ్యాధి హరించుటకు సులభ యోగాలు  - రాజీవ్ దీక్షిత్

*  బొప్పాయి ఆకులను ముద్దగా నూరి బోదకాలు పైన పట్టించుచున్న బోదకాలు వల్ల వచ్చు వాపు హరించును .

*  ఉమ్మెత్త వేళ్ళు , ఆముదపు వేళ్లు , వావిలి వేళ్లు , గలిజేరు వేళ్లు , మునగవేళ్ళు , ఆవాలు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి గోమూత్రముతో నూరి వెచ్చచేసి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .

*  పిక్కలను ఎల్లప్పుడు దారంతో కట్టి ఉంచుచున్న బోధలు హరించును .

*  పసుపు 10 గ్రా , బెల్లం 15 గ్రా , వడకట్టిన గోమూత్రం , 30 ml కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న దీర్ఘకాలం నుంచి బాధించుచున్న బోదకాలు వ్యాధులు హరించును .

*  కరక్కాయ పెచ్చులు ను ఆముదంతో వేయించి ముద్దగా నూరి పూటకి ఉసిరికాయ అంత 30 గ్రాములు గోమూత్రంతో కలిపి రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న యొడల బోదకాలు వ్యాది హరించును .

*  మంజిష్ఠ , అతిమధురం , సన్నరాష్ట్రం , జటామాంసి , గలిజేరు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి పులిసిన బియ్యపు కడుగుతో నూరి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .

  *  జిల్లేడు చెట్టు యొక్క పచ్చి బెరడు ముద్దగా నూరి బోదకాలు పైన , బుడ్డ ల పైన వేసి ప్రతినిత్యం కట్టుచున్న బోదకాలు హరించును .

గమనిక  -

          బోదకాలు వ్యాది కి పైన మీకు సూచించిన సులభయోగాలు లలో లొపలికి తీసుకొనవలిసిన ఔషదాలు లో ఏదో ఒకటి సులభమైనది ఎన్నుకొని వాడండి . అదేవిధంగా పైన పూతగా కూడా సులభ యోగం ఎన్నుకుని కలిపి వాడండి . తొందరగా వ్యాధి నుంచి విముక్తి పొందుతారు.

No comments:

Post a Comment