తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ( 10 ).
వరిగలు ( Proso Millet ) .
భారత దేశంలో విరివిగా వీటిని పండిస్తారు. ఉత్తర భారత దేశంలో , ఎత్తైన గిరిజన ప్రాంతాలలో వర్షాధార పంటగా పండిస్తారు . చైనాలో 7,000 సంవత్సరాల నుండి ఈ వరిగలను పండిస్తున్నారు . ప్రస్తుతం మనదేశంలో , శ్రీ లంకలో , రష్యా , మిడిల్ ఈష్ట్ దేశాలలో , టర్కీ , రుమేనియా , అమెరికా మొదలగు దేశాలలో విరివిరిగా పండిస్తున్నారు . కాని ఈ వరిగలను ఎక్కువ గా పక్షులకు ఆహారంగా వాడుతున్నారు. ఈ వరిగలల్లో గ్లూటెన్ అనే పదార్థం వుండదు . గోధుమలు వాడని వారికి ఈ వరిగలు సరైన ఆహారం. ఈ వరిగలు తియ్యగా మరియు వగరు కలిగి ఉంటాయి .
పోషకాలు : -
చిరుధాన్యాలలో కెల్ల వరిగలలో ఎక్కువ మోతాదులో మాంసకృతులు ( ప్రోటీన్స్ ) ఉంటాయి . పుష్కలంగా లిసితిన్ , ఆమినో ఆమ్లాలు , కార్బోహైడ్రేట్లు , ఫ్యాటి ఆసిడ్స్ , ఫాస్పరస్ , మాంగనీస్ , మెగ్నీషియమ్ మొదలగునవి కలవు .
ఆరోగ్య ప్రయోజనాలు : -
1 . వరిగలను క్రమం తప్పకుండా తింటే పోషక లోపాన్ని దూరంగా ఉంచొచ్చు . వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్దాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు .
2 . వరిగలో లిసితిన్ పుష్కలంగా ఉండటం వలన నరాలు బలంగా పటుత్వం కలిగి ఉంటాయి .
3 . నియాసిన్ అనే పదార్థం వలన చర్మ సంబంధమైన వ్యాధులన్నియు తగ్గి పోవును.
4 . వరిగలలో అమినో ఆమ్లాలు ఉండుట వలన ఆరోగ్యకరమైన కణజలాల నిర్మాణానికి దోహద పడుతుంది .
5 . ఎముకల పటుత్వానికి , హృదయ రోగాలకి , క్యాన్సర్ లాంటి వ్యాధులకు , చిన్న పేగులలో తలెత్తే సమస్యలకు , పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి చాలా మంచి పోషక ఆహారం .
గ్లూటెన్ గురించి ....
గ్లూటెన్ అనేది జిగురుగా వుండే ప్రోటీన్ పదార్థం . ఇది గోధుమ , మైదాలలో అధికంగా వుంటుంది . గ్లూటెన్ ఉండటం వల్ల పదార్ధాలకు సాగే గుణం కలిగి వుండి , జిగురు తత్వం కలిగి వుంటాయి . దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల అజీరణం , గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కీళ్ళ వాతం , ఎసిడిటీ , మలబద్దకం , అతిసారం , చర్మవ్యాధులు , ఊబకాయం , అల్సర్ , త్వరగా అలసి పోవడం , మత్తుగా వుండటం , మైగ్రేన్ లాంటి సమస్యలు తలెత్తుతాయి . ఇందుకు గ్లూటెన్ లేని చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవటమే పరిష్కారం .
"చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం"
సేకరణ.
రాజేష్ ,
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894 91922 .
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894 91922 .
No comments:
Post a Comment