Thursday, June 22, 2017

నిద్ర రావడం లేదా !?

మానసిక అశాంతి వలన నిద్ర రాదు . అధికంగా అలసి పోవడం , సరైన విధంగా ఆహారం తీసుకోక పోవడం , మలబద్ధకం , మానసిక అలసట, ఎక్కవగా చింతించడం , అనారోగ్యం మొదలగు కారణాల వలన కూడా రాత్రి సరిగ్గా నిద్రరాదు . అధిక ధూమ పానం , అధిక మధ్య పానం సేవించడం వలన నిద్ర రాదు . కొద్ది పాటి శబ్దానికే నిద్రలో మెలకవ వస్తుంది . కావున శరీరం త్వరగా అలసి పోవడం , బద్ధకంగా వుంటుంది .

*గృహ చికిత్సలు : -----*

1. *రాత్రి పడుకునే ముందు : ---*            వేడి నీళ్ళతో కాళ్ళు , చేతులను శుభ్రంగా కడగ వలెను . పాదాలకు ఆవాల నూనె ( Mustard oil ) తో మాలిష్ ( మర్ధన ) చేయ వలెను . సుఖమైన నిద్రను పొందండి .

2 . *ఆవాల నూనె లో*  + *పచ్చ కర్పూరంను*  కలిపి తలకు మర్ధన చేయాలి .

3 . 2  Table Spoon ల *తేనె*  + 1 Spoon *ఉల్లి పాయ ( onion ) రసం*  కలిపి తీసుకొన వలెను .

4 . *బొప్పాయి కూర* లేక *బొప్పాయి పండ్ల* ను తినండి .

5 . *ఉసరి కాయ రసం*  + *జాజికాయ చూర్ణం*  కలిపి తీసుకొన వలెను .

6 . కొద్ది నీళ్ళలో *జాజికాయ* ను రుద్ది ( బండ పైన నూరండి ) ఆ  రసంను  కను రెప్పల పైన పూయండి . *మంచి నిద్ర వస్తుంది* .

7 . *తేనె* + *జాజికాయ చూర్ణం*  లను కలిపి తీసుకొండి .
( అలసట , Irritation తగ్గి పోవును ) .

8 . రాత్రి పడుకునే ముందు *తాజా గోరింటాకల* పేష్ట్ ను పాదాలకు పట్టించండి .

9 . *పెరుగు ( లేక ) మజ్జిగ* + *నల్ల ఉప్పు* + *సోంపు*+ *మిరియాల పొడి* + *పటిక బెల్లం* కలిపి త్రాగండి .

10 . రాత్రి భోజనం త్వరగా చేయండి . తక్కువగా తినండి . ఉదయం శారీరక శ్రమ చేయ వలెను .

11 . రాత్రి భోజనం తర్వాత కొద్ది సేపు నడవ వలెను .

    పై విధానాలలో ఏదో ఒక పద్దతిని ఆచరించి  , సుఖంగా నిద్ర పోండి .

No comments:

Post a Comment