దంతాలను సరిగా శుభ్రము చేసుకోలేనపుడు , పంటికి సంబంధించిన రోగాలు వస్తాయి . అత్యధికంగా మలబద్ధకంగా వుండుట వలన , తిన్న ఆహారం జీర్ణం కానపుడు , నోటిలో వున్న దంతాలు పుచ్చి పోతాయి . దంతాలను సరిగా శుభ్రము చేసుకోలేక పోవడం, భోజనము చేసిన తర్వాత , నోటిలో నీళ్ళు వేసుకొని పుక్కిలించక పోవడం వలన , దంతాలలో పురుగులు ఏర్పడతాయి .
*గృహ చికిత్సలు : ----*
1. ఎల్లి పాయ రసం + తేనెలను కలిపి తీసుకొండి . నోటి దుర్వాసన పోతుంది .
2 . కొద్దిగ అల్లం రసం + కొద్దిగ నల్ల ఉప్పు + 1 గ్లాసు నీళ్ళలో కలిపి వేడి చేయండి . నీళ్ళను నోటిలో వేసుకొని పుక్కిళించి , ఉమ్మి వేయ వలెను .
3 . సైంధవ లవణం + మిరియాలు + ఎండిన పొగాకు ఆకులను చూర్ణం గా తయారు చెయ్యండి .
ఈ చూర్ణంలో ఆవాల నూనె ( Mustard Oil ) ను కలిపి , పండ్డకు పూయండి .
4 . 4 లేక 5 జామ ఆకులు + 3 లేక 4 లవంగాలు + 5 గ్రాముల వాము + 1 గ్లాసు నీళ్ళలో మరిగించండి . ఆ నీళ్ళను నోటిలో వేసుకొని పుక్కిళించి , ఉమ్మి వేయండి .
5 . దానిమ్మ తొక్కల పొడి + కొద్దిగా పటిక ( Alum ) లను కలిపి ఒక చూర్ణంగా తయారు చెయ్యండి . ఈ చూర్ణంతో ఉదయం , ,సాయంత్రం దంతాదంతాలను తోమండి .
6 . నిమ్మ కాయ రసంలో లవంగం పొడిని కలిపి పుచ్చి పోయిన పండ్లకు పట్టించండి . దంతాలలో వున్న క్రిములు బయటకు వస్తాయి .
7 . నేరెడు చెట్టు బెరడు పొడిని, పండ్ల పొడిగా వాడండి .
8.ఎక్కువ నొప్పి ఉన్న వారు
చిటికెడు తూర్పుల చూర్ణం+ఒక్క చుక్క లవంగా నూనె(cloveoil)కలిపి పంటి నొప్పి ఉన్న చోట పెట్టాలి.
పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .
No comments:
Post a Comment