Wednesday, February 15, 2017

మనం ప్రతి రోజు వాడే టూత్ పేస్టులు

మనం వాడే పేస్టులన్నీ నాశిరకానికి , చెత్తరకానికి చెందినవి . ఈ పేస్టు తయారు చేసేవాడు ఎలా తయారు చేస్తాడో  ఎప్పుడూ చెప్పడు . దానిలో ఏమి కలుపుతాడో ఎప్పుడూ చెప్పడు . వీటి మీద నాణ్యతకు చెందిన I.S.I. గుర్తు ఉండనే ఉండదు . ఈ పేస్ట్ ను తయారు చేసేది చనిపోయిన జంతువుల ఎముకలతోటి , పందులు , ఆవులు , కుక్కలు , మేకలు ఇవి చనిపోయిన తర్వాత వీటి ఎముకలతోటి తయారు చేస్తున్నారు . మీరు సాంప్రదాయం పాటించే శాఖాహారులతే ఇది ఎంత మాత్రం సమంజసమం ఆలోచించండి . ఈ పేస్ట్ లలో సోడియం లారెయిల్ సల్ఫైడ్ అనే సింధటిక్ డిటర్జంట్ ఉన్నది . బట్టలు ఉతకటానికి ఉపయోగించే డిటర్జంట్ పౌడర్ లలో ఈ *సోడియం లారెయిల్* ని వాడతారు . పళ్ళు పేస్ట్ తో తోమినప్పుడు దీనివలన నురుగ వస్తుంది . ఇది కేన్సర్ కారకంగా పని చేస్తుంది .ఈ పేష్ట్ లలో విషపూరితమైన కెమికల్స్ వాడటం వలన పండ్లు పుచ్చిపోవడం , ఊడిపోవడం లాంటి మొదలైన దంత రోగాలకు కారణమవుతుంది . పూర్తిగా అన్ సైంటిఫిక్ అయిన టూత్ బ్రష్ తో చాలాసేపు బ్రష్ చేయడం పూర్తిగా అశాస్త్రీమైన పద్ధతి . చాలా కఠినమైన ప్లాస్టిక్ పదార్ధంతో ఈ బ్రెష్ లు తయారు చేస్తారు .

      మనదేశం ఉష్ణదేశం . అధిక ఉష్ణోగ్రత కలిగిన దేశాలలో జనులకు చిగుళ్ళు ఎంతో సున్నితంగా ఉంటాయి . ఎంతో సున్నితమైన చిగుళ్ళను టూత్ బ్రెష్ తో ఎక్కవ సేపు తోమడము వలన చిగుర్లు దెబ్బతిని , చిగుళ్ళనుంచి రక్తం కారుతూ ఉంటుంది . అన్నిటికన్నా సైంటిఫిక్ పద్ధతి  వేలితో తోమడం .  వేలితో తోమడం వల్ల మీ చిగుళ్ళు బాగా బలిష్టంగా తయారు అవుతాయి .

      ఉదయం నోటిలో పిత్తమే ( లాలాజలం ) నిండి వుంటుంది . దీన్ని కంట్రోల్ చెయ్యటానికి చెట్ల పుల్లలు , చూర్ణములు ఉపయోగించాలి . టూత్ పేస్ట్ లో చక్కెర వుంటుంది . ఇది పిత్తానికి వ్యతిరేకం . పిత్తం చెడిపోతుంది . ఈ తీపి మీ దంతాలను పాడు చేస్తుంది .

      పళ్ళు తోముకునే పదార్ధం *కషాయం ( చేదు ) గా* ఉండాలి . పిత్తాన్ని తగ్గించటానికి *చేదు* పదార్ధాలకే సాధ్యం . కనుక *వేప , ఉమ్మెత , తుమ్మ , అర్జున , మామిడి  , జామ* వంటి పుల్లలతో పళ్ళు తోముకోవడం మంచిది . ఇవి దొరకవు అనుకుంటే ఆయుర్వేద పళ్ళపొడి , త్రిఫల చూర్ణం పళ్ళపొడి , గోమయ పళ్ళ పొడులను వాడవచ్చును .

*త్రిఫల పొడి చూర్ణం* -- ఇందులో సైంధవలవణం కలిపితే ఇది మంచి దంత మంజనం .

*గోమయ పళ్ళపొడి* -- ఆవు పేడను ఎండబెట్టి కాల్చాలి . ఆ బూడిదలో కాస్త కర్పూరం , కాస్త సైంధవ లవణం కలపాలి . ఇది అన్నిటికంటే చాలా ఉత్తమమైన దంతమంజనం .

       పళ్ళపొడిని నోటిలో 5 నిమిషములు నింపి ఉంచాలి . తరువాత కుడి చేతి చూపుడు వ్రేలితో చిగుళ్ళను బాగా రుద్దాలి . చిగుళ్ళను బాగా మాలీష్ చెయ్యటం వల్ల అవి బలిష్టంగా తయారు అవుతాయి . మీ చిగుళ్ళు బలహీనమైనప్పుడే మీ దంతాలు చెడిపోతాయి . చిగుళ్ళనుతోమే క్రమంలో వాటితో పాటు దంతాలు ఎలాగు తోమబడతాయి .

      ఈ కుడిచేతి చూపుడు వ్రేలిలో ఒక *మెరీడియన్* పాయింట్ ఉంది . ఆ పాయింట్ పెద్ద ప్రేగులకు సంబంధించినది . ఈ వ్రేలిని ఉపయోగించి పళ్ళు తోముకోవటం వలన పెద్ద ప్రేగుకు కూడా కావలసిన వ్యాయామం లభిస్తుంది . మలబద్ధకం నివారించ బడుతుంది .

*ఎప్పుడూ పేష్ట్ , బ్రేష్ లను వాడకండి.*

*పేష్ట్ , బ్రెష్ లను వాడి దంత సమస్యలను తెచ్చుకుంటారో  ?*

             *లేక*

*ఆయుర్వేద పేష్ట్ లను పళ్ళపొడులను వాడి ఆరోగ్యంగా , ఆనందంగా వుంటారో*
          *మీరే నిర్ణయించుకోండి*

      

No comments:

Post a Comment