పోషక విలువలు.:
చిరుధాన్యాలు అద్భుత పోషక ఆహారం. ఇవి పోషక ఆహారాలే కాక ప్రత్యామ్నాయ ధాన్యాలు. ఎక్కువ పీచు పదార్ధాలు కలిగి వుంటాయి. ఈ ధాన్యాలన్నింటిలోను బి - విటమిన్ శాతం ఎక్కువ. ఐరన్ , కాల్షియం , మాంసకృతులు , పీచు పదార్థం , మాంగనీస్ , ఫాస్ఫరస్ , పొటాషియం , మెగ్నీషియం , జింక్ మొదలగు ఖనిజాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. అదనంగా ధయామిన్ , రైబోఫ్లేవిన్ లాంటి బి విటమిన్లూ ... టానిన్లూ , ఫెనోలిక్ ఆమ్లాలూ , యాంధోసియానిన్స్ లాంటి పైటో కెమికల్స్ అందుతాయి.
చిరుధాన్యాల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. దాంతో అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడతాయి . ఫలితంగా ఇన్సులిన్ ను నియంత్రించి రక్తంలో చక్కెర స్ధాయులు అదుపులో ఉంచేలా చేస్తాయి.
మనం ఆరోగ్య పరంగా చూసుకుంటే చిరుధాన్యాలలో ఉన్న పోషకాలు మరే ఇతర ధాన్యాలలో ఉండవు. మనకు తక్కువ మోతాదులో అధిక మొత్తంలో పోషకాలను అందిస్తాయి ఈ చిరుధాన్యాలు.
మంచి ఆహారపు అలవాట్లే మనిషి ఆరోగ్య రహస్యం. ఎంతో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలని మనం మర్చిపోయాం. దాని పర్యవసానం మన దేహం ఎన్నో జబ్బుల నిలయమైంది. తిరిగి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి చిరుధాన్యాలను ఆశ్రయించాల్సిన అవసరం ఎంతో ఉంది.
" చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
No comments:
Post a Comment