తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.
ప్రాచీన కాలం నుంచి మానవ పరిణామక్రమంలో చిరుధాన్యాలు ప్రముఖ పాత్ర పోషించాయి. మన వేదాలలో , పురాణ ఇతిహాసాలలో వీటి గురించి ప్రస్తావన ఉంది. ' శతపథ బ్రాహ్మణ ' అనే పురాణంలో చిరుధాన్యాల గురించి ప్రస్తావన విరివిరిగా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ చిరుధాన్యాల మీద జానపద పాటలు వినపడుతూనే ఉంటాయి. శ్రీ నాథ మహాకవి తన చాటువుల్లో జొన్న , రాగి , అంబలి గురించి ఎలుగెత్తడం మన ఆహారపు అలవాట్లలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేస్తుంది. దీన్ని బట్టి మన నాగరికత పొడవునా చిరుధాన్యాలు గాఢంగా పెనవేసుకున్నాయని స్పష్టమవుతోంది.
తృణధాన్యాలు లేక చిరుధాన్యాలు ఆఫ్రికా ఖండం నుండి ఆసియా , ఐరోపా ఖండాలకు కొన్ని వేల సంవత్సరాల మునుపే వచ్చాయని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. మయన్ నాగరికతలోనూ , హరప్పా , మొహంజదారో నాగరికతల్లోను వీటి ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. చైనా షాంగ్ రాజుల పరిపాలనను ' చిరుధాన్యాల యుగం ' గా అభివర్ణించారు. రోమన్ లు చిరుధాన్యాల పిండితో గంజి , రొట్టెలు తయారు చేసుకునేవారని వాళ్ళ చరిత్ర చెబుతుంది.
చిరుధాన్యాలు ( Millets ).
1. రాగులు. ( Finger Millet ).
2. జొన్నలు ( Sorghum ).
3. సజ్జలు / గంట్లు ( Pearl Millet ).
4. అరికలు ( Kodo Millet ).
5. వరిగలు ( Proso Millet ).
6. సామలు ( Little Millet ).
7. ఊదలు ( Barnyard Millet ).
8. కొర్రలు ( Foxtail Millet ).
2. జొన్నలు ( Sorghum ).
3. సజ్జలు / గంట్లు ( Pearl Millet ).
4. అరికలు ( Kodo Millet ).
5. వరిగలు ( Proso Millet ).
6. సామలు ( Little Millet ).
7. ఊదలు ( Barnyard Millet ).
8. కొర్రలు ( Foxtail Millet ).
ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. చిరుధాన్యాలు చిన్నగా , గుండ్రంగానూ , కోలగాను వుంటాయి. అధిక పోషక విలువలు కలిగిన సంపూర్ణ ఆహారం. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం మరియు పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండిస్తారు. పేద దేశాల ప్రజలకు ఆహారపు అవసరాల్ని తీరుస్తాయి. ఈ పంటల సాగుకు రసాయన ఎరువుల అవసరం లేదు.
భూగర్భ జలాలను కానీ , ఉపరితల నీటి వనరులను కానీ వినియోగించకుండా కేవలం వర్షపు నీటి ఆధారంగా చిరుధాన్యాలను పండించవచ్చు.
భారతదేశము నందు రాగులు , జొన్నలు , సజ్జలు , కొర్రలు , అరికెలు , వరిగలు , ఊదలు మరియు సామలు ఈనాటికీ వాడుకలో కలవు. ఆఫ్రికా ఖండం నందు కూడా తృణధాన్యాలు ప్రధానాహారం.
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావకానూ , రొట్టెగాను , లేదా సంకటిగానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్డి పసుగ్రాసంగా పనికి వచ్చును.
ప్రస్తుత కాలంలో ఈ చిరుధాన్యాల వాడుక పెరుగు చున్నది.
" చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "
-- సేకరణ
- రాజేష్
- బాలాజి స్వస్తిక్ స్వదేశీ స్టోర్స్.
- కర్నూలు.
Cell. 9989491922.
- బాలాజి స్వస్తిక్ స్వదేశీ స్టోర్స్.
- కర్నూలు.
Cell. 9989491922.
No comments:
Post a Comment